- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్స్.. వీడియో వైరల్
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ట్రంప్ అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో భార్య, అమెరికా ఫస్ట్ లేడి మెలానియాతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ దంపతుల కూడా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్, తన బైబిల్‌ను చేతిలో పట్టుకుని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు.
US NEWS
— TT (@6002_TT) January 21, 2025
2025 Presidential Post-Inaugurationpic.twitter.com/tEhDyJ9HF3
Presidential Inaugural Ball First Dance
President Donald J. Trump and First Lady Melania's Inaugural Ball First Dance






