- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను పొగిడిన ట్రంప్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏం చేయాలో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అని అనుకుంటున్నాను.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ పరస్పరం సుంకాలు పెంచుతూ అమెరికా, చైనా అధ్యక్షులు దీనికి మరింత ఆజ్యం పొసే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను 'స్మార్ట్ మ్యాన్ ' అంటూ ప్రశంసలు కురించడం విశేషం. వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడిన సందర్భంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏం చేయాలో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అని అనుకుంటున్నాను. అతను చాలా తెలివైన వ్యక్తి. దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆ విషయం తనకు తెలుసు, అతని వ్యవహారశైలి కూడా తనకు బాగా తెలుసునని అన్నారు. చైనా సరైన ఒప్పందం కుదుర్చుకుంటుందని అనుకుంటున్నాను. త్వరలో జిన్‌పింగ్ నుంచి ఫోన్ కాల్ వస్తుందని భావిస్తున్నాను. అందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రపంచానికే కాదు, మానవాళి మొత్తానికి గొప్ప విషయమని అన్నారు. తాజాగా ట్రంప్ దేశాలపై సుంకాల విషయంలో కొంత వెనక్కి తగ్గారు. 90 రోజుల వరకు టారిఫ్ అమలును వాయిదా వేస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించారు. అయితే, బేసిక్ టారిఫ్ 10 శాతం మాత్రం అమలవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమపై ప్రతీకార సుంకం విధించిన చైనాపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.






