Trump: త్వరలోనే గాజాలోనూ సీజ్ ఫైర్.. ట్రంప్ కీలక ప్రకటన !

by B.Srinivas |

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన అనంతరం ట్రంప్ ప్రస్తుతం గాజాలోనూ సీజ్ ఫైర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Trump: త్వరలోనే గాజాలోనూ సీజ్ ఫైర్.. ట్రంప్ కీలక ప్రకటన !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, ఇరాన్ (Israel Hamas) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రస్తుతం గాజాలోనూ సీజ్ ఫైర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గాజాలో శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదాన్ని ఆపాలని ఇరు పక్షాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘గాజాలో ఒప్పందం కుదుర్చుకోండి.. బందీలను తిరిగి తీసుకురండి’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Nethanyaahu) త్వరలో అమెరికాలో పర్యటించొచ్చని, అక్కడ గాజాలో సీజ్ ఫైర్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చని పలు కథనాలు పేర్కొన్నాయి. అంతేగాక గత శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ వచ్చే వారంలోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరొచ్చని తెలిపారు. గాజాలో సీజ్ ఫైర్‌కు ప్రయత్నిస్తున్నామని, దీనిని జాగ్రత్తగా చేసేందుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దీంతో త్వరలోనే హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఉండొచ్చని తెలుస్తోంది.

నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్

ఇజ్రాయెల్‌లో అవినీతి, మోసం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహుకు ట్రంప్ మద్దతు తెలిపారు. ఆయన ఎదుర్కొంటున్నతి భయంకరమైన పరిస్థితి అని తెలిపారు. నెతన్యాహు యుద్ధ వీరుడు అని ఇరాన్‌లోని ప్రమాదకరమైన అణు ముప్పును వదిలించుకోవడంలో అమెరికాతో కలిసి గొప్పగా పనిచేశారని కొనియాడారు. ఆయన ప్రస్తుతం హమాస్‌తో ఒప్పందంపైనా చర్చలు జరుపుతున్నారని, ఇందులో బందీలను తిరిగి తీసుకురావడం కూడా ఉందని తెలిపారు. కానీ ఆయన ఎటువంటి కారణం లేకుండా రోజంతా కోర్టులోనే గడపాల్సి వచ్చింది అది రాజకీయ హింస తప్ప మరొకటి కాదని తెలిపారు.

Next Story