- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ షాకింగ్ నిర్ణయం: పాకిస్థాన్ పర్యటన రద్దు.. ఇరాన్‌తో చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న చర్చలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న చర్చలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ వేదికగా ఇరాన్‌తో జరగాల్సిన శాంతి చర్చల కోసం వెళ్లాల్సిన తన ప్రతినిధుల పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తన ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ పర్యటనను నిలిపివేస్తూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. "కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృథా కాదు. మా దగ్గర అన్ని దారులు (Cards) సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వెనుదిరిగిన ఇరాన్ ప్రతినిధులు..
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే, "చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు" అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు.






