Trump: గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్ కెనడా గవర్నర్‌.. ట్రూడోపై ట్రంప్ సెటైర్లు

by Shamantha N |

అమెరికా- కెనడాల మధ్య సుంకాల(Tariffs) విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్యే అమెరికా తదుపరి అధ్యక్షుడు(Donald Trump).. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Trudeau)తో భేటీ అయ్యారు. ‘

Trump: గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్ కెనడా గవర్నర్‌.. ట్రూడోపై ట్రంప్ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా- కెనడాల మధ్య సుంకాల(Tariffs) విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్యే అమెరికా తదుపరి అధ్యక్షుడు(Donald Trump).. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Trudeau)తో భేటీ అయ్యారు. ‘గవర్నర్‌ ఆఫ్‌ కెనడా’ అంటూ ట్రంప్ ట్రూడోను ఉద్దేశిస్తూ సెటైర్ వేశారు. వలసలు ఆపకపోతే కెనడా అమెరికాలోని 51వ రాష్ట్రంగా మారుతుందంటూ చురకలు అంటించారు. ‘గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్ కెనడా గవర్నర్‌ జస్టిన్‌ ట్రూడోతో కలిసి డిన్నర్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరోసారి గవర్నర్‌తో భేటీ అయ్యి సుంకాలు, వాణిజ్యంపై లోతుగా చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాం. ఆ చర్చల ఫలితం అద్భతంగా ఉంటుంది’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

కెనడాపై 25 శాతం సుంకం

ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం టారీఫ్ లు విధించనున్నట్లు ట్రంప్‌ (Trump) ప్రకటించారు. దీంతో వెంటనే అమెరికాకు పయనమైన ట్రూడో.. మార్‌-ఏ-లాగో రిసార్టులో ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణా అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగానే వాటిని కట్టడి చేయలేని పక్షంలో కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాల్సి ఉంటుందని ట్రూడో (Trudeau)కు చురకలంటించారు. మరోవైపు, ట్రంప్ తమపై టారిఫ్‌లు విధిస్తే.. ప్రతిచర్యలకు దిగుతామని ట్రూడో హెచ్చరించారు.

Next Story