Trump: సిరియా ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకోవద్దు.. డొనాల్డ్ ట్రంప్

by vinod kumar |
Trump: సిరియా ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకోవద్దు.. డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో రెబల్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (HTS), సైన్యం మధ్య కొనసాగుతున్న వివాదంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. సిరియా యుద్ధంలో అమెరికా (Amerika) జోక్యం చేసుకోవద్దని తెలిపారు. వివాదానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘సిరియాలో తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. దీనితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మా పోరాటం కాదు. రష్యా సిరియా నుంచి బయటకు వెళ్లవలసి వస్తే, అది ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వారికి ప్రత్యేక ఉపయోగం ఏమీ లేదు’ అని తెలిపారు. రష్యా ఇప్పటివరకు సిరియా ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారుగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ రష్యా కూడా అసద్ ప్రభుత్వాన్ని రక్షించలేక పోతుందని తెలిపారు. ఈ ఘర్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా తలదూర్చకూడదని స్పష్టం చేశారు. అయితే యూఎస్ అధ్యక్షుడు బైడెన్ కూడా దాడికి మద్దతు ఇవ్వడం గానీ, యూఎస్ మిలిటరీ జోక్యం చేసుకోవాలని గానీ పేర్కొనలేదు.

Advertisement

Next Story

Most Viewed