Trump: ఆపరేషన్ సిందూర్.. తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన అమెరికా

by Shamantha N |

హెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. కాగా.. పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేపట్టింది.

Trump: ఆపరేషన్ సిందూర్.. తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. కాగా.. పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేపట్టింది. ఇలాంటి సమయంలో తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. అక్కడి మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందను.. భారత్‌-పాక్‌ నియంత్రణ రేఖకు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఇరుదేశాల గగనతలాల మూసివేత, పాక్‌లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. పాక్‌లో దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంగా ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని.. అమెరికా అడ్వైజరీ సూచించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది.

ఇప్పటికే స్పందించిన పాక్..

మరోవైపు, పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల విషయంపై అమెరికా ఇప్పటికే స్పందించింది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఘర్షణలకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరని.. భారత్‌, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ప్రపంచానికి శాంతి మాత్రమే కావాలని, ఘర్షణలు వద్దని అన్నారు. మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ఇస్లామాబాద్ లోని భారత రాయబారికి పాక్‌ సమన్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story