Trump: చైనాపై 100 శాతం టారిఫ్ విధించాలి.. నాటో దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి

by B.Srinivas |

చైనాపై 50 నుంచి100 శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు పిలుపునిచ్చారు.

Trump: చైనాపై 100 శాతం టారిఫ్ విధించాలి.. నాటో దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాపై 50 నుంచి100 శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నాటో దేశాలకు పిలుపునిచ్చారు. ఇది ఉక్రెయిన్‌లో యుద్ధం ముగింపు పలికేందుకు దారితీస్తుందని తెలిపారు. రష్యాను ఆర్థికంగా బలహీన పర్చేందుకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ నాటో దేశాలకు శనివారం ఓ లేఖ రాశారు. నాటో కంట్రీస్ అన్నీ రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని, రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని సూచించారు. దీనిని నాటో దేశాలు అంగీకరించి చర్యలు ప్రారంభిస్తే రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ‘నాటో మిత్ర దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేయాలి. చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలను విధించాలి. వార్ ముగిసిన తర్వాత మాత్రమే ఈ టారిఫ్ ఉపసంహరించుకోవాలి. దీంతో మాస్కోపై బీజింగ్ ప్రభావం తగ్గుతుంది. రష్యా ఆర్థికంగా బలహీనపడుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు. తాను చెప్పినట్టు చేస్తే యుద్ధం త్వరగా ముగుస్తుందని తెలిపారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తు్న్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇరు దేశాల అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. అయితే కాల్పుల విరమణ సహా శాంతి ఒప్పందం ఖరారు కాలేదు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు నిలిచిపోయినట్టు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నాటో దేశాలకు లేఖ రాయడం గమనార్హం. అంతకుము ముందు ట్రంప్ యుద్ధం ముగిసే దిశగా ఎటువంటి పురోగతి లేకపోతే మాస్కోపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు.

Next Story