- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని విదేశీ చిత్రాలపై 100 శాతం టారిఫ్ (Tarrif) విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇతర దేశాలు హాలీవుడ్‌ను అణగదొక్కుతున్నాయని, సినిమాను ప్రచార సాధనంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ (Truth social) లో సోమవారం పోస్ట్ చేశారు. ‘అమెరికాలో సినీ పరిశ్రమ అత్యంత వేగంగా క్షీణిస్తోంది. యూఎస్ చిత్రనిర్మాతలు, స్టూడియోలను మా దేశం నుంచి దూరం చేయడానికి ఇతర దేశాలు అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీని వల్ల హాలీవుడ్, ఇతర విభాగాలు ప్రభావితమవుతున్నాయి. ఇది ఇతర దేశాల సమిష్టి కుట్ర. జాతీయ భద్రతకు సైతం ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని వాణిజ్య శాఖను ఆదేశించారు. అమెరికాలో మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కొత్త టారిఫ్‌లు పోటీని సమం చేయడానికి, అమెరికా గడ్డపై తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఉపయోగపడతాయని పలువురు యూఎస్ ప్రతినిధులు భావిస్తున్నారు. ఎందుకంటే అనేక అంతర్జాతీయ నగరాలు చలనచిత్ర, టీవీ నిర్మాణాలను ఆకర్షించడానికి పన్ను మినహాయింపులను అందిస్తున్నాయి. దీని ఫలితంగా కెనడాలోని టొరంటో, ఐర్లాండ్ లోని డబ్లిన్ వంటి ప్రదేశాల్లో అమెరికా నిర్మాతకు ఎక్కువగా సినిమాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని తిరిగి అమెరికాకు రప్పించడానికే ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు.






