- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి.. కాంగ్రెస్‌లో కాకపుట్టిస్తున్న డీకే ట్వీట్
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార విభజన ఒప్పందం తీవ్రంగా ఉద్రిక్తతకు దారి తీసింది.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార విభజన ఒప్పందం తీవ్రంగా ఉద్రిక్తతకు దారి తీసింది. 2023లో రూపొందిన ఈ ఒప్పందం ప్రకారం శివకుమార్, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు సిద్దరామయ్య తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవిని వదులుకోబోనని ఇటీవల బహిరంగ వేదికపైనే ప్రకటనలు చేస్తున్నారు.
కాగా, ఇదే అంశంపై పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు ప్రియాంక్ ఖర్గే రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే, సోనియాతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధికార పార్టీలో సీఎం కుర్చీ పోట్లాటను ‘సీఎం చైర్ స్టాక్ అవుట్’ అనే ఏఐ వీడియోతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా తాజాగా చేసిన హాట్ ట్వీట్ కర్ణాటక కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా.. అధినేత అయినా.. నాతో పాటు ఎవరైనా సరే.. వారి మాటను నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి” అని హైకమాండ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






