- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trudeau: అమెరికాతో వాణిజ్య యుద్ధం తప్పదు.. కెనడా ప్రధాని ట్రూడో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడాపై భారీగా సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడాపై భారీగా సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. కెనడా సైతం సుంకాల విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్‌లో అమెరికాతో వాణిజ్య యుద్ధం (Trade war) తప్పదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (JustinTrudeau) తెలిపారు. యూఎస్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం నుంచి తమ దేశం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. కెనడియన్ వస్తువులపై అన్యాయమైన అమెరికా సుంకాలను ఎత్తివేసే వరకు మేము మా ప్రతీకార సుంకాల నుండి వెనక్కి తగ్గబోమని పునరుద్ఘాటించారు.
ట్రంపుతో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజే ట్రూడో ఈ ప్రకటన చేయడం గమనార్హం. కెనడా దిగుమతులపై అమెరికా విధించే సుంకాలపై కెనడా సీనియర్ అధికారులు అమెరికాతో చర్చలు కొనసాగిస్తారన్నారు. కాగా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ 25శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయానికి నిరసనగా, కెనడా రాబోయే 21 రోజుల్లో 155 బిలియన్ల విలువైన అమెరికన్ దిగుమతులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రూడో ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది.






