Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో

by B.Srinivas |

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని కెనడా ప్రధాని జస్టి్న్ ట్రూడో ప్రకటించారు. వీలైతే రాజకీయాల నుంచి సైతం తప్పుకుంటానని తెలిపారు.

Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని కెనడా ప్రధాని జస్టి్న్ ట్రూడో (Canadian Justin Trudeau) ప్రకటించారు. వీలైతే రాజకీయాల నుంచి సైతం తప్పుకుంటానని, ఇది నా సొంత నిర్ణయమని తెలిపారు. తాజాగా ఆయన ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. ‘పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాక భవిష్యత్‌లో నేను ఏం చేస్తాను అనే దానిపై పెద్దగా ఆలోచన లేదు. ప్రస్తుతం కెనడియన్లు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడమే ముందున్న లక్ష్యం. కీలక సమయంలో ఏం చేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరించా’ అని వ్యాఖ్యానించారు. ఈ దేశం చుట్టూ ఎప్పుడూ రాజకీయాలు జరుగుతూనే ఉంటాయన్నారు. అయితే ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడం కెనడా జాతీయ ప్రయోజనాలలో ఉందని స్పష్టం చేశారు.

కాగా, ట్రూడో తొలిసారిగా 2008లో క్యూబెక్‌లోని పాపినో నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి కెనడా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2013లో లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలోనే 2015 ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించింది. అనంతరం కెనడాకు రెండో అతి పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి అయ్యాడు. అయితే 2019, 2021 ఎన్నికల్లో ఆయన పార్టీకి మెజారిటీ రాలేదు. పలు పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పీఎంగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పలు పరిణామాల వల్ల కెనడా పీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో ఎన్నికలు జరిగే వరకు ఆయన ప్రధాని గానే కొనసాగుతారు.

Next Story