- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మహువా మొయిత్రా (వీడియో)
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక బంగ్లాను మహువా ఇవాళ ఖాళీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక బంగ్లాను మహువా ఇవాళ ఖాళీ చేశారు. ఎంపీగా ఉన్న మహువాకు ఢిల్లీలో ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు అయిన క్రమంలో.. బంగ్లాను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బంగ్లాను వీడినట్లు సమాచారం. అయితే ఆ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు ఓ టీమ్‌ను కూడా పంపినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఆమెకు నాలుగు సార్లు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు పంపి బేకాతరు చేశారు. చివరిగా జనవరి 17 న మరోసారి నోటీసులు రావడంతో ఆమె ఖాళీ చేశారు.
#WATCH | Expelled parliamentarian Mahua Moitra (TMC) vacates her Government allotted accommodation in New Delhi pic.twitter.com/1S0qFC6qoQ
— ANI (@ANI) January 19, 2024






