- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TMC: స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో టీఎంసీ ఎమ్మెల్యే అరెస్టు
ఈ కేసుకు సంబంధించి ఈడీ పలువురు నేతల ఇళ్లపై సోదాలు ప్రారంభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను సోమవారం కోర్టు ఆగస్టు 30 వరకు ఈడీ కస్టడీకి పంపింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ కుంభకోణం వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ పలువురు నేతల ఇళ్లపై సోదాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ముర్షిదాబాద్ జిల్లాలోని టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ నివాసం సహా ఆయనకు చెందిన పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, ఈడీ సోదాల గురించి సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఇంటి చుట్టూ మోహరించిన ఈడీ అధికారులు ఆయన పారిపోవడాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పారిపోయే సమయంలోనే ఎమ్మెల్యే కృష్ణ తన వద్ద ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేసే క్రమంలో మొబైల్‌ఫోన్‌ను ఇంటి దగ్గరలో ఉన్న చెరువులో పారేశారని ఈడీ అధికారులు వెల్లడించారు. మరో రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అనంతరం ఆయనను కోల్‌కతాలోని స్పెషల్ ఈడీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన ఇంటితో పాటు వారి అత్తమామలకు చెందిన ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఎనిమిది వేర్వేరు ఖాతాలలో రూ. 46 లక్షల డబ్బు దొరికిందని ఈడీ కోర్టుకు తెలియజేసింది. 2020, సెప్టెంబర్ 2 నుంచి 2020, డిసెంబర్ 14 మధ్య కృష్ణ భార్య ఠాగూర్ సాహా ఖాతాలో రూ. 26 లక్షల మొత్తం జమ అయిందని ఈడీ స్పష్టం చేసింది. నిధుల గురించి అడిగినప్పుడు, ఆమె మొదట అది తన స్కూల్ జీతం అని చెప్పారని, తర్వాత జీతం వివరాలను అందించకపోవడంతో తన భర్త తనకు డబ్బు ఇచ్చాడని అంగీకరించినట్టు తేలింది. కృష్ణ తండ్రి బ్యాంకు ఖాతాలో కూడా నగదు జమ అయినట్టు ఈడీ గుర్తించింది. కాగా, ఈ కుంభకోణం కేసులో కృష్ణ సాహాను 2023, ఏప్రిల్‌లో సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది మే నెలలోనే ఆయనకు బెయిల్ వచ్చింది.






