TMC leader arrest: బాలికను ఇంటికి పిలిచి.. రెండుమూడు రోజులు నిర్బంధించి..

by Shamantha N |
TMC  leader arrest: బాలికను ఇంటికి పిలిచి.. రెండుమూడు రోజులు నిర్బంధించి..
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ లో బాలికపై లైంగికి దాడికి పాల్పడిన కేసులో తృణమూల్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నారాయణ్ మిత్రాపై ఓ బాలిక సంచలన ఆరోపణలు చేసింది. బంకుర్ లోని మిత్రా నివాసంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక ఆరోపించింది. రెండుమూడ్రోజుల పాటు బాలికను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, పశ్చిమబెంగాల్ పోలీసులు శనివారం మిత్రాను అరెస్టు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఈ పరిణామాలతో తృణమూల్ పార్టీ టేర్డ యూనియన్ నుంచి మిత్రాను సస్పెండ్ చేసింది.

Advertisement

Next Story