- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్ ప్రపంచంలో ప్రకంపనలు.. అమెరికా ఐటీ దిగ్గజాలపై ఇరాన్ యుద్ధం!
అమెరికా టెక్ దిగ్గజాలపై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఏప్రిల్ 1న మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా సహా 18 కంపెనీలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా (America)కు చెందిన అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న ఈ దాడులు నిర్వహించనున్నట్లు ఇరాన్ పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లాలే లక్ష్యం..
ఇరాన్ విడుదల చేసిన జాబితాలో మొత్తం 18 అమెరికన్ టెక్ దిగ్గజాల పేర్లు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft), యాపిల్ (Apple), టెస్లా (Tesla), అమెజాన్ (Amazon), మెటా (Meta/Facebook) వంటి సంస్థలు ఉన్నాయి. అమెరికా అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇరాన్‌పై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, సైబర్ గూఢచర్యానికి నిరసనగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లుగా ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఈ దాడులు కేవలం సైబర్ దాడులకే పరిమితం అవుతాయా లేదా ఇతర రూపాల్లో ఉంటాయా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏప్రిల్ 1వ తేదీనే ఇరాన్ ఎంచుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా లేదా అని ఆరా తీస్తున్నారు.






