- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వందేభారత్ రైలుపై చెట్టు కొమ్మలు.. మూడుగంటలు నిలిచిపోయిన ట్రైన్
ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఒడిశాలో ప్రారంభించిన వందే భారత్ రైలుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఒడిశాలో ప్రారంభించిన వందే భారత్ రైలుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రైలు దాదాపు మూడు గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకున్నది. ఇటీవల ప్రధాని మోడీ.. ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌లో ప్రధాని వందే భారత్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఈ రైలుపై చెట్లు కూలిపడ్డాయి.
దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. పూరీ నుంచి హౌరా వెళుతున్న వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారమే దీన్ని అధికారికంగా ప్రారభించడం గమనార్హం. ఒడిశాలోని జైపుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. దీంతో ఇవాళ వందేభారత్ఎక్స్ప్రెస్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Read More: నార్కో పరీక్షకు వారు సిద్దంగా ఉంటే నేను కూడా సిద్దమే: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్






