- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Train: 2029లో అందుబాటులోకి బుల్లెట్ రైలు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
2029 నాటికి ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రారంభం అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2029 నాటికి ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రారంభం అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vaishnaw) వెల్లడించారు. అలాగే గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య దేశంలోని మొట్టమొదటి హై-స్పీడ్ రైలు కారిడార్ 50 కిలోమీటర్ల విభాగం 2027 నాటికి పూర్తవుతుందని తెలిపారు. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఉన్న మొత్తం బుల్లెట్ రైలు మార్గం 2029 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రైలు ప్రారంభమయ్యాక ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి కేవలం రెండు గంటల ఏడు నిమిషాలు మాత్రమే పడుతుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూరత్ బుల్లెట్ రైల్వే స్టేషన్‌ను అశ్వినీ వైష్ణవ్ శనివారం సందర్శించారు. ట్రాక్ ఇన్‌స్టాలేషన్, మొదటి టర్నౌట్‌ను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రత, ప్రయాణం సజావుగా సాగడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. రైలు స్థిరంగా, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సూరత్ స్టేషన్‌లో ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్, ఇతర యుటిలిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కావడం గమనార్హం.






