జల్లికట్టులో తీవ్ర విషాదం.. ఎద్దు పొడవటంతో ముగ్గురు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-02 12:37:51  IST  )

తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఏర్పాటు చేసిన జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

జల్లికట్టులో తీవ్ర విషాదం.. ఎద్దు పొడవటంతో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని శివగంగై జిల్లాలో ఏర్పాటు చేసిన జల్లికట్టు(Jallikattu) పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎద్దు పొడవటంతో మృగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయాలైన వారిని నిర్వహకులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్ల లోపంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు సాంప్రదాయ క్రీడగా దీనిని తమిళనాడు ప్రజలు గుర్తిస్తారు. ఈ జల్లికట్టు పోటీలను చూసేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. అయితే పరిగెత్తే పశువులను కట్టడి చేయడానికి ఈ పోటీ నిర్వహిస్తారు. పరుగులు తీస్తున్న పశువులను పట్టుకోవడానికి యువకులు ఉత్సాహంగా పోటీ పడటంతో విషాదం చోటుచేసుకుంది.

Next Story