- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ర్యాలీలో మరోసారి విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి
సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందాడు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే మృతికి కారణమని వారు ధ్రువీకరించారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37)గా గుర్తించారు. ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా సేలానికి వచ్చిన అతడు, కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
విజయ్ ర్యాలీల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
మరోవైపు తొక్కిసలాట వంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా విజయ్ ర్యాలీల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే, అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మందిని నిర్వాహకులు అనుమతించడంతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయిందని పేర్కొన్నారు. 5 వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా, దాదాపు 7 వేల మందిని తరలించారని చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో నిర్వహించిన విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇటువంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.






