- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: ఆలయంలో భారీ తొక్కిసలాట.. అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం
తొక్కిసలాటలో ఆరుగులో దుర్మరణం పాలైన విషాద ఘటన గోవాలోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలైన విషాద ఘటన గోవా (GOA) రాష్ట్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షిర్గావ్ (Shirgao) ప్రాంతంలోని ప్రముఖ శ్రీదేవి లయ్‌రయీ ఆలయా (Sridevi Lyrayi Temple)నికి జాతర సందర్భంగా వేలాదిగా జనం తరలిచ్చారు. ఈ క్రమంలోనే ఆలయ సాంప్రదాయం ప్రకారం నిప్పులపై నడిచే ఆచారం ఉండటంతో భక్తులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ, అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పి భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 60 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం మపూసా (Mapusa)లోని జీఎంసీ (GMC), నార్త్ గోవా (North GOA) జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసుపత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు.






