వినాయక నిమజ్జనంలో విషాదం.. లండన్‌లో ఇద్దరు హైదరాబాద్‌ వాసుల దుర్మరణం

by Naga Rani Yarlagadda |

లండన్‌లో వినాయక నిమజ్జనంలో (Ganesh Immersion) విషాద ఘటన జరిగింది.

వినాయక నిమజ్జనంలో విషాదం.. లండన్‌లో ఇద్దరు హైదరాబాద్‌ వాసుల దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లో వినాయక నిమజ్జనంలో (Ganesh Immersion) విషాద ఘటన జరిగింది. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా.. రెండు కార్లు ఢీ కొట్టడంతో ఇద్దరు మరణించారు. వారిద్దరినీ హైదరాబాద్‌కు చెందిన తర్రె చైతన్య (23), రిషితేజ (21)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హైదరాబాద్‌లోని నాగర్‌గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్నకొడుకు చైతన్య బీటెక్ పూర్తి చేసి.. హయ్యర్ స్టడీస్ కోసం 8 నెలల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ వినాయకచవితి ఉత్సవాలను జరుపుకుని 8 మంది ఫ్రెండ్స్‌తో కలిసి రెండుకార్లలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. అంతా పూర్తి చేసి తిరిగి వస్తుండగా.. వారి కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో చైతన్య, రిషితేజ మరణించారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story