- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Benguluru : బెంగుళూరులో దారుణం.. సూట్ కేసులో బాలిక శవం లభ్యం
బెంగుళూరు(Benguluru)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు(Benguluru)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగుళూరు శివారులోని ఓల్డ్ చందాపుర రైల్వే బ్రిడ్జ్(Old Chandapura ROB) సమీపంలో ఈ సూటుకేసు(Suitcase)లో బాలిక శవం లభ్యం(Girl Dead Body) అయింది. హోసూర్ మెయిన్ రోడ్‌కు దగ్గరలోని ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర సూటుకేసులో ఓ శవం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సూటుకేసులోని శవం 10 - 12 ఏళ్ల బాలికదిగా గుర్తించారు. అయితే వేరే చోట చంపి, సూటుకేసులో తీసుకువచ్చి బ్రిడ్జి మీది నుంచి కిందకి విసిరినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
అనంతరం ఈ కేసును బైయప్పనహళ్లి రైల్వే పోలీసులకు ఫార్వర్డ్ చేయగా.. రైల్వే ట్రాక్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బెంగుళూరు రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సి.కె. బాబా మాట్లాడుతూ.. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేనందున ఇంకా ఎవరన్నది తేలలేదన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలోని మిస్సింగ్ కేసుల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే ఆ బాలిక ఎవరన్నది, నిందితులు ఎవరన్నది కంపెడతామని పేర్కొన్నారు.






