- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: బిగ్ షాకింగ్ న్యూస్.. మిస్ వరల్డ్ ఆత్మహత్య
పుదుచ్చేరి (Puducherry)కి చెందిన మిస్ వరల్డ్ మోడల్ శాన్ రేచల్ అలియాస్ శంకర ప్రియ (25) బలవన్మరణానికి పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి (Puducherry)కి చెందిన మిస్ వరల్డ్ మోడల్ శాన్ రేచల్ అలియాస్ శంకర ప్రియ (25) ఆదివారం ఆర్ధరాత్రి దాటాక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఆమె అధిక మోతాదులో బీపీ (BP)తో పాటు స్లీపింగ్ పిల్స్ (Sleeping Pills) మింగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆరోగ్య, ఆర్థిక సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కారామణికుప్పంకు చెందిన శంకరప్రియ అలియాస్ శాన్ రేచల్ (25) చిన్నతనంలోనే క్యాన్సర్ కారణంగా తల్లిని కోల్పోయింది. ఆమె నల్లగా ఉండటంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.
కానీ, అవన్నీ పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ అత్యున్నతంగా రాణించారు. 2020-21లో మిస్ పాండిచ్చేరి, 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు (Queen Tamilnadu), ఒకే ఏడాదిలో మిస్ బెస్ట్ యాటిట్యూడ్ (Miss Best Attitude) టైటిల్స్‌ను సాధించారు. అదేవిధంగా బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్‌ని సొంతం చేసుకునన్నారు. గత కొన్నిరోజులుగా కిడ్నీ సమస్యతో జిప్మర్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తన నివాసంలో బీపీ, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.






