Fatal Road Accident : పెళ్ళింట్లో తీవ్ర విషాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

by Muthe.Rajitha |

హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని మండి(Mandi) జిల్లాలో పెళ్లింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Fatal Road Accident : పెళ్ళింట్లో తీవ్ర విషాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని మండి(Mandi) జిల్లాలో పెళ్లింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు(Car Accident) లోయలో పడి ఐదుగురు మరణించారు. ఈ ఘటన పెళ్లి ఇంటిని శోక సముద్రంలో ముంచి వేసింది. మండి పోలీసుల వివరాల ప్రకారం.. మండి జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందినవారని, వారు గుర్గావ్ నుండి పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మండి జిల్లాలోని చౌంతరాలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గుర్గావ్ నుండి కారులో బయల్దేరారు. చౌంతరా దగ్గరికి రాగానే ఘాటు రోడ్డు మార్గాన్ని డ్రైవర్ అంచనా వేయలేకపోవడంతో పక్కనే ఉన్న లోయలోకి కారు దూసుకు పోయింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు సభ్యులు అక్కడిక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉండటం స్థానికులను కలచివేసింది. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, రోడ్డు పరిస్థితులు, లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

Next Story