- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Traffic: ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాలివే?
ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ వల్ల అత్యంత నెమ్మదిగా నడిచే నగరాల జాబితాలో హైదరాబాద్ 18వ స్థానంలో నిలిచింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ వల్ల అత్యంత నెమ్మదిగా నడిచే నగరాల జాబితాలో హైదరాబాద్ (Hyderabad)18వ స్థానంలో నిలిచింది. ఈ నగరంలో పది కిలోమీటర్ల ప్రయాణానికి 32 నిమిషాల సమయం పడుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 నగరాల్లో ఇండియాకు చెందిన కోల్‌కతా (Kolkata), బెంగళూరు (Bengaluru), పూణే (Pune) నగరాలున్నాయి. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ (Tom Tom Trafic index) 14వ ఎడిషన్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 737 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సేకరించిన ఫ్లోటింగ్ కార్ డేటా (FCD) ఆధారంగా రూపొందించిన వార్షిక సూచిక తాజాగా విడుదలైంది. ఈ రిపోర్టులో 62 దేశాల్లోని 500కు పైగా నగరాలకు టామ్ టామ్ ఇండెక్స్ ర్యాంకులు కేటాయించింది.
రెండో స్థానంలో కోల్‌కతా
ప్రపంచంలోనే రెండో అత్యంత నెమ్మదిగా నడిచే నగరంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నిలిచింది. ఈ నగరంలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 34 నిమిషాల 33 సెకన్లు పడుతుందని నివేదిక తెలిపింది. అంటే నగర రోడ్లలో గంటకు 17 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తు్న్నారు. ఈ సిటీలో తక్కువ రద్దీ ఉన్నప్పటికీ ఇరుకైన రోడ్ల వల్ల రవాణాలకు ఆటంకం కలుగుందని తెలుస్తోంది.
మూడో స్థానంలో బెంగళూరు
భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా పిలువబడే కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే నగరాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ పది కిలోమీటర్ల ప్రయాణించడానికి 34 నిమిషాల 10 సెకన్ల సమయం తీసుకుంటుంది. అలాగే మహారాష్ట్రలోని పూణే సిటీ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ నగరంలో 10 కిలోమీటర్లకు సగటున 33 నిమిషాల 22 సెకన్ల టైం పడుతుంది. ఇది గతేడాది కంటే కాస్త మెరుగుపడటం గమనార్హం. సగటు ప్రయాణ సమయం తగ్గిన మొదటి ఐదు నగరాల్లో ఇది ఏకైక భారతీయ నగరం కావడం గమనార్హం.
టాప్ ప్లేసులో కొలంబియా
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా దక్షిణ అమెరికాలోని కొలంబియా నిలిచింది. అలాగే ఐదో స్థానంలో యూకేలోని లండన్ ఉంది. టాప్ 5లో మూడు భారతీయ నగరాలే ఉండటం గమనార్హం. ఇక, చెన్నయ్ 31వ స్థానం, ముంబై 39వ స్థానం, అహ్మదాబాద్ 43, ఢిల్లీ 122వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీలో 10 కిలోమీటర్లకు 23 నిమిషాల పది సెకన్ల సమయం పడుతుంది.






