- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టర్కీకి మరో షాక్ ఇచ్చిన వ్యాపారులు.. పాలరాయి దిగుమతుల బహిష్కరణ
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తల సమయంలో ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ పాక్ కు అండగా నిలిచిన టర్కీకి ఊహించని షాక్ తగులుతుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తల సమయంలో ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ పాక్ కు అండగా నిలిచిన టర్కీ (Turkey)కి ఊహించని షాక్ తగులుతుంది. ఆ దేశం నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే యాపిల్స్ (Apples)పై ఇప్పటికే భారత వ్యాపారులు బ్యాన్ విధించగా.. మరో పెద్ద వ్యాపారం పై కూడా ప్రభావం పడింది. ఈ రోజు ఉదయం.. ఉదయపూర్‌లోని పాలరాయి వ్యాపారులు పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ టర్కీ (Turkey) నుంచి పాలరాయి దిగుమతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయపూర్ మార్బుల్ ప్రాసెసర్ల కమిటీ (Marble Processors Committee) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. టర్కీ నుంచి పాలరాయి, గ్రానైట్ దిగుమతిని వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ ప్రధాని మోడీకి కూడా లేఖ రాసింది. వారి నిర్ణయాన్ని అధికారికంగా ఆయనకు తెలియజేస్తూ, టర్కిష్ పాలరాయి దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది.






