- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trade war: వాణిజ్య యుద్ధానికి తెర.. అమెరికా, చైనాల మధ్య కీలక ఒప్పందం !
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జెనీవాలో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, చైనా (America china) మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జెనీవాలో రెండు రోజుల పాటు జరిగిన చర్చల్లో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి చైనాతో ఒక ఒప్పందానికి వచ్చినట్టు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్‌లు తెలిపారు. చైనా అధికారులతో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరిందనే వివరాలను వారు వెల్లడించలేదు. సోమవారం పూర్తి వివరాలు తెలుపుతామని చెప్పారు. దీనిని చైనా భాగస్వాములతో కురుచ్చుకున్న ఒప్పందంగా అభివర్ణించారు. వాణిజ్య లోటును తగ్గించడంతో ఈ డీల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ ఆగిపోయే చాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు.
కాగా, గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాపై 145 శాతం టారిఫ్ విధించారు. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికన్ వస్తువులపై 125 శాతం సుంకాన్ని విధించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. తాజా చర్చలతో సుంకాలు తగ్గించడంతో పాటు పలు ఒప్పందాలు సైతం కుదిరినట్టు తెలుస్తోంది. ఇరు దేశాలు సోమవారం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.






