- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trade deal: ఇండియా, ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. త్వరలోనే ప్రకటించే చాన్స్
భారత్, ఒమన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే డీల్ జరిగిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే డీల్ జరిగిందని అగ్రిమెంట్ పత్రాన్ని ఒమన్‌లో అరబిక్ లోకి అనువదించిన తర్వాత రెండు దేశాలు ఆమోదిస్తాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉందని తెలిపారు. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్ షిప్ (CEPA) అని పిలవబడే ఈ అగ్రిమెంట్ కోసం 2023 నవంబర్ లో ఇరు దేశాల మధ్య అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా చర్చలు ముగిశాయి. ఇద్దరు వాణిజ్య భాగస్వాములు తమ మధ్య వర్తకం చేయబడిన వస్తువులపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గించడం, తొలగించడం చేస్తారు. అంతేగాక సేవల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి వారు నిబంధనలను కూడా సులభతరం చేయనున్నట్టు సమాచారం. కాగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లో ఇండియాకు ఒమన్ మూడో అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉంది. భారత్ ఇప్పటికే మరొక జీసీసీలో సభ్యదేశమైన యూఏఈతో ఈ తరహా ఒప్పందాన్ని కలిగి ఉండగా, ఇది మే 2022లో అమల్లోకి వచ్చింది.






