బిహార్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ టీమ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు టీపీసీసీ ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

సుమారుగా మరో నెలరోజుల్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరగనున్నాయి.

బిహార్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ టీమ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు టీపీసీసీ ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సుమారుగా మరో నెలరోజుల్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరగనున్నాయి. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనప్పటికీ అక్టోబర్ లో ఎన్నికలు, నవంబర్లో కౌంటింగ్, ఫలితాలు ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. బిహార్ లో కాంగ్రెస్ (Congress Party) అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వేళ.. అక్కడ అసెంబ్లీ ఎన్నికల కోసం పలువురు తెలంగాణ నేతలు బిహార్ కు వెళ్లాలని టీ.పీసీసీ (TPCC) ఆదేశించింది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలకు ఇప్పటికే ఫోన్ కాల్స్ చేసి.. టీపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్లే మంత్రులు, నేతలు బిహార్ లో ఏయే నియోజకవర్గా్ల్లో పనిచేయాలో దిశానిర్దేశం చేసింది.

బిహార్ కు 8సార్లు ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ ను గద్దె దించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వామపక్ష పార్టీలు, ఆర్జేడీలతోకాంగ్రెస్ జతకట్టింది. బిహార్ లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇండి కూటమి పార్టీలైన ఆర్జేడీలో 77 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో 19, సీపీఐ (ఎంఎల్)-11, సీపీఐ (ఎం)-2, సీపీఐ -ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్టీఏ పార్టీలైన బీజేపీలో -80, జేడీ(యూ)- 45, హెచ్ఏఎం (ఎస్)-4, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని, అధికార, ప్రతిపక్షాల పార్టీలు ధీమాతో ఉన్నాయి.

Next Story