- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > స్మార్ట్ కళ్లజోడుతో పద్మనాభుడి ఆలయంలోకి వెళ్లిన టూరిస్ట్.. అరెస్ట్ చేసిన పోలీసులు
స్మార్ట్ కళ్లజోడుతో పద్మనాభుడి ఆలయంలోకి వెళ్లిన టూరిస్ట్.. అరెస్ట్ చేసిన పోలీసులు
by Naga Rani Yarlagadda |
కేరళలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి వెళ్లిన ఓ టూరిస్ట్..

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి వెళ్లిన ఓ టూరిస్ట్.. కళ్లజోడుకు కెమెరా అమర్చి ఆలయం లోపలి దృశ్యాలను రికార్డు చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సింగపూర్ లోని నార్త్ షోర్ డ్రైవ్ నివాసి అయిన తిరునీపనార్ (49)గా గుర్తించారు. తిరునీపనార్ శనివారం ఉదయం కెమెరా అమర్చిన స్మార్ట్ ఐ గ్లాసెస్ ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి లోపలి వీడియోను రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఆలయ ఉత్తరం వైపు, తులాభారం మండపంతో పాటు ఇతర ప్రదేశాలను సైతం చిత్రీకరించాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని ఫోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 21న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు.
Next Story






