Viral: హమ్మయ్య.. ప్రాణాలు దక్కాయి.. కర్ణాటకలో పర్యాటకుడిపై ఏనుగు దాడి (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-08-11 13:23:06  IST  )

కర్ణాటకలో పర్యాటకుడిపై ఏనుగు దాడి చేసింది.

Viral: హమ్మయ్య.. ప్రాణాలు దక్కాయి.. కర్ణాటకలో పర్యాటకుడిపై ఏనుగు దాడి (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అది దాటి ప్రవర్తిస్తే పర్యవసానాలు అంతే దారుణంగా ఉంటాయి. తాజాగా ఓ పర్యాటకుడు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఏనుగు దాడిలో (Elephant Attack) అదృష్టం కొద్ది ప్రాణాలతో బయట పడగలిగాడు.కర్ణాటకలో (Karnataka) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో బందీపూర్ జాతీయ ఉద్యానం (Bandipur Tiger Reserve) లోపల వాహనాలు, ప్రజలతో నిండిన రోడ్డుపై అడవి ఏనుగు నిలబపడి కనిపిస్తోంది. ఆ ఏనుగు అక్కడే ఉన్న ఓ పర్యాటకుడి మీదకు లగెత్తింది. ఏనుగు వెంబడించడం గమనించిన సదరు వ్యక్తి గజరాజు బారి నుంచి తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నం చేశాడు. పరుగు మొదలు పెట్టిన ఆవ్యక్తి కాసేపటికే జారి కింద పడిపోయాడు. వేగంగా దూసుకువచ్చిన ఆ ఎనుగు అతనిపై దాడి చేసింది. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రమాదకర జంతువులు తారసపడితే దూరంగా వెళ్లిపోవాలని అలా కాదని తిక్క పనులు చేస్తే తప్పకుండా తిక్క కుదురుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


VIDEO!


Next Story