- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుండపోత వర్షాలు.. జలమయమైన నగరం.. 100కి పైగా విమానాలపై ప్రభావం!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురవటంతో పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ (Heavy traffic) స్తంభించి, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అలాగే వాతావరణం (Weather) అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు (Flight Affected by Rains) అంతరాయం ఏర్పడింది.
దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించారు. ఇటు ఎయిరిండియా, ఇండిగో సంస్థలు సైతం తమ ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి. ఇక ఈ భారీ వర్షాల కారణంగా విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్‌పాస్ జలమయమవ్వడంతో డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీటమునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో తెల్లవారుజాము వరకు నమోదైన వర్షపాతం
* సఫ్దర్‌జంగ్: 81 మిల్లి మీటర్ల వర్షపాతం.
* పాలం: 68 మిల్లి మీటర్ల వర్షపాతం.
* పూసా: 71 మిల్లి మీటర్ల వర్షపాతం.
* మయూర్ విహార్: 48 మిల్లి మీటర్ల వర్షపాతం.






