- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమల్ హాసన్ పార్టీకి టార్చిలైట్ గుర్తు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ 'మక్కళ్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చిలైట్ గుర్తును కేటాయించింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ 'మక్కళ్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చిలైట్ గుర్తును కేటాయించింది. గతంలో 2029లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనూ కమల్ పార్టీకి ఇదే గుర్తును కేటాయించింది. ఈ క్రమంలో మరోసారి టార్చిలైట్ గుర్తునే కేటాయిస్తే ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే తమిళనాడులో 2026మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2026 మే 10న ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో సినిమా తారలు సైతం మెరవనున్నారు. ఇప్పటికే తమిళరాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న కమల్ హాసన్ పోటీ చేయడంతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ సైతం బరిలోకి దిగనున్నారు. విజయ్ కి పార్టీ గుర్తుగా ఎన్నికల కమిషన్ విజిల్ ను కేటాయించింది. ఇక విలక్షణ నటుడుగా కమల్ హాసన్, స్టార్ హీరోగా విజయ్ అభిమానులను సంపాదించుకోగా రాబోయే ఎన్నికల్లో వీరిద్దరి పర్ఫామెన్స ఎలా ఉండబోతుందో చూడాలి.






