ఆ కోపంతోనే భారత్‌పై ట్రంప్ సుంకాలు.. షాకింగ్ విషయం చెప్పిన జెఫ్రీస్!

by Phanindra |

భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించడంలో వ్యక్తిగతం కోపం కూడా ఉందట. ఈ విషయాన్ని వివరిస్తూ జెఫ్రీస్ కంపెనీ షాకింగ్ రిపోర్టు విడుదల చేసింది.

ఆ కోపంతోనే భారత్‌పై ట్రంప్ సుంకాలు.. షాకింగ్ విషయం చెప్పిన జెఫ్రీస్!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు వేయడంలో డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత కోపం కూడా కారణమేనట. ఈ విషయాన్ని ప్రముఖ యూఎస్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ కంపెనీ జెఫ్రీస్ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నించినప్పుడు భారత్ నిరాకరించిందని, దీంతో ట్రంప్‌కు కోపం వచ్చిందని పేర్కొంటూ ఈ కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది.

‘భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్లో అమెరికన్ ప్రెసిడెంట్ జోక్యం కల్పించుకునేందుకు భారత్ అంగీకరించకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు వేస్తున్న భారీ సుంకాలు’ అని సదరు రిపోర్టు వెల్లడించింది. అయినా సరే తనే ఈ యుద్ధం ఆపానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. వీటిని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చింది. అలాగే భారత్, పాక్ మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం చేయడానికి తాము అంగీకరించబోమని కూడా భారత్ తేల్చిచెప్పింది.

అయితే భారత్-పాక్ సహా పలు యుద్ధాలను ట్రంప్ ఆపారని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్‌హౌస్ కూడా పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు భారత వ్యవసాయ మార్కెట్‌లోకి యూఎస్ కంపెనీలను భారత్ రానివ్వడం లేదని, ఇది కూడా ట్రంప్‌కు కోపం తెప్పించిందని జెఫ్రీస్ రిపోర్టు పేర్కొంది.

Next Story