West Bengal: మమతా ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

by S Gopi |

25 వేల టీచర్ల నియామకాల కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కలకత్తా హైకోర్టు తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది

West Bengal: మమతా ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన 25 వేల టీచర్ల నియామకాల కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కలకత్తా హైకోర్టు తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై దర్యాప్తు చేపట్టింది. గురువారం దీనిపై కీలక తీర్పును వెలువరిస్తూ.. టీచర్ల నియామకాలకు సంబంధించిన విషయాలను పరిశీలించిన అనంతరం, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నియామకాలను రద్దు చేస్తూ ఇదివరకు కలకత్తా హైకోర్టు తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. కలకత్తా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది.

Next Story