Isha Foundation: ఈశా ఫౌండేషన్ పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు- సుప్రీంకోర్టు

by Shamantha N |

ఈశా ఫౌండేషన్‌(Isha Foundation)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో ఊరట లభించింది. ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Isha Foundation: ఈశా ఫౌండేషన్ పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు- సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశా ఫౌండేషన్‌(Isha Foundation)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో ఊరట లభించింది. ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మద్రాసు హైకోర్టు(Madras High Court) జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్‌, జస్టిస్ ఎన్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులో వెల్లియంగిరిలో ఈశా ఫౌండేషన్‌ ను అక్రమంగా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మించినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (TNPCB) ఆరోపించింది. దీనిపైనే తమిళనాడు ప్రభుత్వం నోటీసులు సైతం జారీ చేసింది. ఫౌండేషన్‌ ఈ నోటీసులపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ టీఎన్‌పీసీబీ నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారమే నిర్మాణం జరిగినట్లు పేర్కొంది. కాగా.. కాలుష్య నియంత్రణ బోర్డు ఈ తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్‌ చేసింది. దీనిపైనే సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. అన్ని పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలకు లోబడే యోగా, ధ్యాన కేంద్రం నిర్మాణం జరిపినట్లు తెలిపింది. అంతేకాక.. ఆ ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని టీఎన్‌పీసీబీని ఆదేశించింది.

Next Story