TDS: అన్ని దేశాల్లోనూ ఈ విధానం ఉంది.. టీడీఎస్ రద్దు చేయాలన్న పిల్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

by Shamantha N |

టీడీఎస్(TDS) విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది.

TDS: అన్ని దేశాల్లోనూ ఈ విధానం ఉంది.. టీడీఎస్ రద్దు చేయాలన్న పిల్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: టీడీఎస్(TDS) విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. దీనిపైన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాలని కోరింది. టీడీఎస్ విధానం వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందన్న పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే, దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లోపభూయిష్ఠంగా ఉన్న ఈ వ్యాజ్యాన్ని తాము విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. టీడీఎస్‌ విధానం అన్ని దేశాల్లోనూ అమలవుతోందని గుర్తు చేసింది. కావాలంటే దీనిపై, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ప్రతిచోటా అనుసరిస్తున్న టీడీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టీడీఎస్‌ విధానం సమానత్వపు హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఎలాగైనా దీన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా, టీడీఎస్ నిబంధనలు పాటించాల్సిన వ్యక్తులు, సంస్థలు ఎదుర్కొంటున్న పరిపాలనా, ఆర్థిక సవాళ్లపై అశ్వినీ ఉపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story