- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
24 గంటల్లో యూఎస్ వచ్చేయండి.. హెచ్1బీ ఉద్యోగులకు బడా కంపెనీల ఆల్టిమేటం
హెచ్1బీ వీసా నిబంధనలు మారడంతో ఉద్యోగులకు బడా కంపెనీలు కొత్త ఆల్టిమేటం ఇచ్చాయి. 24 గంటల్లో యూఎస్ వచ్చేయాలని విదేశాల్లో ఉన్న వారందరినీ కోరాయి.

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్1బీ వీసా ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమాంతం లక్ష డాలర్లకు పెంచేయడంతో టెక్ కంపెనీలు షాకయ్యాయి. ఈ ఫీజు ప్రభావాన్ని తట్టుకునేందుకు చర్యలు చేపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న తమ హెచ్1బీ వీసాదారులను యూఎస్ వదిలి వెళ్లొద్దని హెచ్చరించాయి. మెటా, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి పలు కంపెనీలు ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో హెచ్1బీ ఉద్యోగులు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్లు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని కూడా ఈ కంపెనీలు తేల్చిచెప్పాయట. లేదంటే యూఎస్‌లో వారి రీఎంట్రీని అడ్డుకునే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా చేశాయని సమాచారం.
అమెరికాలో ఉన్న వాళ్లు కనీసం 14 రోజులు ఎక్కడకూ వెళ్లొద్దని, కొత్త నిబంధనలు అమలయ్యాక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు ఈ కంపెనీల సూచించాయి. మైక్రోసాఫ్ట్ అయితే యూఎస్‌లో ఉన్న ఉద్యోగులు ఎక్కడకూ వెళ్లొద్దని గట్టిగా హెచ్చరించింది. యూఎస్ బయట ఉన్న వారు కూడా తిరిగి వచ్చేందుకు సాధ్యమైనంత ప్రయత్నించాలని సూచించింది. గతంలో 214 డాలర్లుగా ఉన్న హెచ్1బీ వీసా ఫీజును ట్రంప్ ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్1బీ వీసాల్లో 70 శాతం వరకు భారతీయులే పొందుతున్నారు.






