- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం : సుధా మూర్తి
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఆమె తన పూర్వికుల కోసం ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాకుండా పవిత్ర స్నానాన్ని కూడా ఆచరించారు.

దిశ, నేషనల్ బ్యూరో:
మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించడం అనేది జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశమని రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి అభివర్ణించారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఆమె తన పూర్వికుల కోసం ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాకుండా పవిత్ర స్నానాన్ని కూడా ఆచరించారు. 'ఇక్కడ మూడు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాను. సోమవారం పవిత్ర గంగలో మునిగాను. ఇవ్వాళ కూడా స్నానమాచరించారు. రేపు (బుధవారం) కూడా మరోసారి పవిత్ర స్నానం చేస్తాను' అని సుధా మూర్తి చెప్పారు. మా తాతయ్య, నానమ్మ, ఇంకో తాతయ్య ఇక్కడకు రాలేక పోయారు. అందుకే వారి తరపున ఇక్కడ పూజలు చేయించి, తర్పణం వదిలాను. నాకు చాలా సంతోషంగా ఉందని సుధా పేర్కొన్నారు. యూపీ సీఎం యోగా ఆదిత్యానాథ్ నేతృత్వంలోని అధికారులు, ప్రజలు ఇక్కడ మంచి పనులు చేశారు. వారందరికీ మంచి ఆరోగ్యం, జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.






