- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే శుభాంశు శుక్లా రోదసి యాత్ర.. ముహూర్తం ఫిక్స్ చేసిన NASA
యాక్సియం-4 (Axiom-4) మిషన్‌పై నాసా (NASA) కీలక అప్‌డేట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: యాక్సియం-4 (Axiom-4) మిషన్‌పై నాసా (NASA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు రేపు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla)తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు యాక్సియం-4లో ప్రయోగంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS)కు వెళ్లనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 10న స్పేస్ లాంఛ్ సెంటర్ ఉన్న ఫ్లోరిడా (Florida) ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం, అనంతరం పలుమార్లు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ఇప్పటికి రోదసి యాత్ర ఆరు సార్లు వాయిదా పడింది. స్పేస్‌ఎక్స్ (Space X) సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో వీరు రోదసిలోకి వెళ్లనున్నారు. అయితే, ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అటాచ్ అవుతుంది. శుభాంశు శుక్లా బృందం అక్కడే 14 రోజుల పాటు బస చేసి అనేక ప్రయోగాలు నిర్వహించనుంది.






