- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూ వలసలతో సమస్య లేదు.. టామీ రాబిన్సన్ కామెంట్స్ వైరల్
హిందూ వలసలతో సమస్య లేదంటూ గతంలో టామీ రాబిన్సన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే వలసలకు వ్యతిరేకంగా ఆయన భారీ ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా ‘యునైట్ ది కింగ్డమ్’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించిన యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్.. భారతీయుల విషయంలో మాత్రం సదభిప్రాయమే వెల్లడించారు. భారతీయులు, అందునా హిందువులపై ఆయన అభిప్రాయాలు పూర్తి రైట్ వింగ్ ఆందోళనకారులకు భిన్నంగా ఉన్నాయి. భారతీయులు శాంతి కాముకులని, ప్రశాంతంగా జీవించే వలసదారుల కమ్యూనిటీ అని, వాళ్లు బ్రిటిష్ జీవితాలతో కలిసిపోతారని రాబిన్సన్ చెప్పారు.
మిగతా వలసదారులంతా బ్రిటిష్ గుర్తింపుకు ప్రమాదమనే రాబిన్సన్.. భారతీయుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం దేశాల నుంచి వచ్చే వలసలు, భారతీయుల మధ్య చాలా తేడా ఉన్నట్లు 2022 నుంచే రాబిన్సన్ చెప్తున్నారు. అప్పట్లో ఆసియా కప్ మ్యాచ్ తర్వాత హిందూ, ముస్లిం వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో హిందువులకు మద్దతుగా వందలాది మందిని రంగంలోకి దింపుతానని రాబిన్సన్ చెప్పడం సంచలనం రేపింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా మద్దతిచ్చే రాబిన్సన్.. 2024లో మోడీ విజయాన్ని కొనియాడారు. హిందువులు భయాందోళనలను కలిగించరని, బ్రిటన్ సమాజంలో కలిసిపోయి జీవిస్తారని రాబిన్సన్ పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలో భారతీయులు, హిందువులపై రాబిన్సన్ గత ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి.






