కొత్తజంట ప్రయివేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. టోల్ ప్లాజా సిబ్బంది అరెస్ట్

by Muthe.Rajitha |

ప్రయాణికుల ప్రయివేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

కొత్తజంట ప్రయివేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. టోల్ ప్లాజా సిబ్బంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణికుల ప్రయివేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో టోల్ ప్లాజా సిబ్బందిని అరెస్ట్ చేసి విచారిస్తే.. పలు షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. యూపీలోని పూర్వాంచల్ హైవేపై ఓ కొత్తజంట కారులో వెళ్తూ రొమాన్స్ చేశారు. అయితే ఆ కారు టోల్ ప్లాజాను క్రాస్ అవుతుండగా.. అక్కడ పనిచేసే సిబ్బందిలో అశుతోష్ అనే వ్యక్తి సీసీ టీవీ ద్వారా ఆ ఫుటేజీని రికార్డ్ చేసాడు. ఆ కారు నంబర్ ద్వారా... కారులో ప్రయాణించిన జంట వివరాలు తీసుకొని, వారికి ఆ వీడియో ఫుటేజీ పంపి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.

లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో వారు భయపడి కొంత డబ్బు ఇచ్చాడు. అయినప్పటికీ అశుతోష్ ఆ వీడియోను డిలీట్ చేయకపోగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అది వైరల్ అయ్యేలా చేసాడు. ఈ వ్యవహారంపై ఆ జంట పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి విచారించారు. అయితే గతంలోనూ అశుతోష్ ఇలాంటి ఎన్నో వీడియోలు రికార్డ్ చేసాడని పోలీసుల తేలింది.

Next Story