- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NHAI: టూ వీలర్స్‌కు టోల్ ఫీజు? క్లారిటీ ఇచ్చిన ఎన్‌హెచ్ఏఐ
ఫోర్ వీలర్స్ మాదిరి ఇకపై టూ వీలర్స్‌కు టోల్ ఫీజు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోర్ వీలర్స్ మాదిరి ఇకపై టూ వీలర్స్‌కు టోల్ ఫీజు (Toll fee for two wheelers) వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు (National Highway) నేషనల్ హైవేలపై ప్రయాణించే ఫోర్ వీలర్స్, ట్రక్స్ లాంటి ఇతర పెద్ద వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు మాత్రం టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అయితే ద్విచక్ర వాహనాలకు సైతం టోల్ ఫీజు విధానం అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. జులై 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగింది.
హైవేలపై తిరిగే బైకుల సంఖ్య పెరగడంతో టూ వీలర్స్‌కు టోల్ ఫీజు నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జోరుగా పెరగడంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందారు. దీంతో ఈ వార్తలపై కేంద్రం ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. టూ వీలర్స్‌కు టోల్ వసూలు.. ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. బైక్‌లకు టోల్ చార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారత్ సర్కార్ ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేయాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయని పేర్కొంది. అలాంటి ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదని, ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు ప్రవేశ పెట్టే ప్రణాళికలు లేవని ట్వీట్‌లో పేర్కొంది.
అదే విధంగా ఈ టోల్ వసూలు ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వార్తలను ఖండించారు. ‘కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేయనున్నట్లు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ప్రతిపాదించబడలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్‌పై పూర్తి మినహాయింపు కొనసాగుతుంది. నిజం తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా సంచలనం సృష్టించడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదు. దీనిని నేను ఖండిస్తున్నాను.’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.






