- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేనేం తప్పు మాట్లాడలేదు.. నిధులు, కేబినెట్ పదవి లేదని నిజమే చెప్పా: కంగనా రౌత్
మండిలో వరద బాధితులను పరామర్శిస్తూ నిధులు, కేబినెట్ పదవి లేదన్న కంగనా రౌత్.. తాను నిజమే చెప్పానని, తప్పుగా ఏం మాట్లాడలేదని అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలతో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన నియోజకవర్గంలో తాజాగా పర్యటించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వింత వ్యాఖ్యలు చేశారు. మండిలో బాధితులను పరామర్శించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. ‘నా వద్ద కేబినెట్ పదవి లేదు. ఎలాంటి విపత్తు నిర్వహణ నిధులూ లేవు’ అన్నారు. ఈ వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతలు రనౌత్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో తన మాటలను సమర్థించుకున్న కంగన.. ‘ప్రజలకు నేను వాస్తవాన్ని చెప్పా. నా చేతుల్లో ఏముంది? ఏం లేదు? అనే విషయం వివరించారు. ఒక ఎంపీగా ఈ సమస్యను లేవనెత్తి నిధులు తీసుకురావాలి. నాకు కొన్ని పరిమితులున్నాయి. అయితే ప్రజలకు మా పార్టీ అన్నిరకాలుగా సహాయం చేస్తుందని చెప్పా’ అని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ లేఖ రాస్తానని, ఇప్పటి వరకు భారీ వర్షాల వల్ల 78 మంది వరకు మరణించిన నేపథ్యంలో హిమాచల్‌కు ప్రత్యేక ప్యాకేజీ అడుగుతానని ఆమె చెప్పారు. తను మాట్లాడిన రెండు వాక్యాలు పట్టుకొని కాంగ్రెస్ పెద్ద రచ్చ చేస్తుందన్న ఆమె.. వాళ్లు నిధులను ఎలా ఉపయోగిస్తారో చూస్తానన్నారు.






