- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్: దళపతి విజయ్ సెన్సేషన్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై మళ్లింది. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ సర్వే సంస్థ ‘టుడేస్ చాణక్య’ తాజాగా వెల్లడించిన అంచనాలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై మళ్లింది. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ సర్వే సంస్థ ‘టుడేస్ చాణక్య’ తాజాగా వెల్లడించిన అంచనాలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సర్వే ప్రకారం ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే (DMK) మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తుండగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ తన ప్రభావాన్ని బలంగా చాటుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు టుడేస్ చాణక్య అంచనా వేసింది. డీఎంకేకు 114 నుంచి 136 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి స్టాలిన్ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంటారని ఈ సర్వే చెబుతోంది.
దళపతి విజయ్ సెన్సేషన్..
ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి కేవలం 34 నుంచి 56 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. గతంతో పోలిస్తే అన్నాడీఎంకే ఓటు బ్యాంకు భారీగా చీలిపోయినట్లు స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే.. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు దళపతి విజయ్ సాధించబోయే స్థానాలు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ 52 నుంచి 74 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని టుడేస్ చాణక్య వెల్లడించింది. అన్నాడీఎంకే కంటే ఎక్కువ సీట్లు సాధించి, విజయ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద శక్తిగా లేదా కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మే 4న వెలువడే అసలు ఫలితాల్లో ‘టుడేస్ చాణక్య’ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.






