ఈ వారాంతంలోనే ఎన్నికల షెడ్యూల్ !?

by Dishanational4 |
ఈ వారాంతంలోనే ఎన్నికల షెడ్యూల్ !?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘంలో నూతన ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ గురువారం పూర్తి కావడంతో.. వచ్చే 48 గంటల్లో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారంలోగా విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతోంది. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోల్స్ జరిగే అవకాశమున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ ఉన్నాయి. బుధవారం రోజు జమ్మూలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ సారథ్యంలోని కేంద్ర ఎన్నికల టీమ్ పర్యటించింది. అక్కడ కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై ఈసీ ఆరా తీసింది. ఒకవేళ కశ్మీర్‌లో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ పోల్స్ నిర్వహించడం కుదరకుంటే.. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రెండు నెలల్లోగా అసెంబ్లీ పోల్స్‌ను నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.


Next Story

Most Viewed