- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సోనియాగాంధీ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. ‘శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ X హ్యాండిల్ ‘సోనియా గాంధీ నాయకత్వంలో అమలైన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం, విద్యాహక్కు చట్టం (RTE), సమాచార హక్కు చట్టం (RTI) వంటి సంక్షేమ చట్టాలను దేశం గుర్తు చేసుకుంది. ‘ఆమె జీవితం సమగ్రత, కరుణ, ధైర్యానికి ప్రతీకం.. జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 2009, డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున తొలి అధికారిక ప్రకటన వెలువడిన వేళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కలెక్టరేట్ (District Collectorates) ప్రాంగణాల్లో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏకకాలంలో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit-2025) వేదికగా ఉదయం 10 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్‌గా ప్రారంభించనున్న విషయం తెలిసిందే.






