Siddaramaiah : హ్యాపీ బర్త్ డే సీఎం సిద్దూ సార్!

by Disha Web Desk 6 |
Siddaramaiah : హ్యాపీ బర్త్ డే సీఎం సిద్దూ సార్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారి(ఆగస్టు 3న) పుట్టినరోజు. ఆయనను సిద్దూ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గం 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది 20 మే 2023న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి కేబినెట్ సమావేశం తర్వాత, సిద్దరామయ్య పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని ‘5 హామీలు’ ఆమోదించబడిందని మరియు తరువాతి కేబినెట్ సమావేశంలో అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

కాగా, ఆయన సీఎం అయ్యాక రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత్ర ప్రయాణ సౌకర్యం కల్పించారు. అంతేగాక, గతంలోనూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి మరోసారి ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.‘హ్యాపీ బర్త్ డే సీఎం సిద్దూ సార్’ అంటూ ఆయన అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Next Story

Most Viewed