- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంబోర్గిని కారు బీభత్సం.. ఎఫ్ఐఆర్‌లో నిందితుడి పేరు మిస్
కాన్పూర్ లో లంబోర్గిని కారు బీభత్సం సృష్టించింది. రూ.10 కోట్ల విలువైన ఈ కారును ఓ పొగాకు వ్యాపారి కుమారుడైన శివం నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: కాన్పూర్ లో లంబోర్గిని కారు బీభత్సం సృష్టించింది. రూ.10 కోట్ల విలువైన ఈ కారును ఓ పొగాకు వ్యాపారి కుమారుడైన శివం నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే శివంను పట్టుకుని పోలీసులకు అప్పగించినా.. అతని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని తెలుస్తోంది. నిందితుడిపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కాన్పూర్లో వీఐపీ రోడ్డులోని రేవ్ మాల్ సమీపంలో లంబోర్గిని కారు అదుపుతప్పి పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆటో, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ను ఢీ కొట్టడంతో అది 10 అడుగుల ఎత్తుకు ఎగిరి కిందపడింది. ఒక కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి కారు ఆగింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో శివం మిశ్రా మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఆ తర్వాత అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. మరో వాహనంలో ఉన్న అతని బౌన్సర్లు స్థానికులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో కారు అద్దాలను పగలగొట్టి శివంను బయటికి లాగి పోలీసులకు అప్పగించారు. ప్రముఖ పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కొడుకే శివం మిశ్రా. అందుకు పలుకుబడి, డబ్బు ఉపయోగించి అతని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చకుండా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. శివంకు రూ.60 కోట్ల విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఉందని, అన్ని వాహనాలకు నంబర్ ప్లేట్ 4018గానే ఉన్నట్లు గుర్తించారు.
మిశ్రా కుటుంబంపై గతంలోనే ఐటీ దాడులు జరిగాయి. 2024లో బన్సీధర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ భారీ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత, లెక్కల్లో చూపని నగదు, విదేశీ లావాదేవీలకు సంబంధించి అప్పట్లో సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లు, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రకటించిన ఆదాయానికి, వారి వద్ద ఉన్న ఆస్తులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.






